ఎమ్మిగనూరులో 24వ మున్సిపల్ వార్డు, లక్ష్మీపేటలో పందుల పెంపకం వల్ల ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. సుమారు 100 పందులు పెంచడం వల్ల దుర్గంధం, మురికి ఏర్పడి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని సీపీఎం నాయకులు గోవిందు, సురేష్ పేర్కొన్నారు. పేద ప్రజలు దోమలు,పాముల బారిన పడి ఆసుపత్రులకు వెళ్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంతో వారు కమిషనర్ కి సోమవారం వినతిపత్రం అందజేశారు.