ప్రభుత్వం అసైన్మెంట్ ద్వారా లబ్ధిదారులకు ఇచ్చిన భూములను ఇతరులు స్వాధీనం చేసుకోకుండా రక్షణ కల్పించాలని ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ రమేష్ మాదిగ కోరారు. మంగళవారం కృష్ణగిరిలో తహసీల్దార్ చంద్రశేఖర్ కు వినతిపత్రం అందజేశారు. మాదాపురంలో అసైన్మెంట్ ద్వారా ఇచ్చిన భూములను కొందరు అక్రమిస్తున్నారన్నారు. జిల్లా అధ్యక్షుడు గిడ్డయ్య మాదిగ, తదితరులు ఉన్నారు.