జూపాడుబంగ్లాలో రెవిన్యూ గ్రామసభలతో భూ సమస్యలకు పరిష్కారం
జూపాడుబంగ్లా రెవెన్యూ గ్రామసభల ద్వారా భూ సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తహసిల్దార్ చంద్రశేఖర్ నాయక్ సోమవారం అన్నారు. ఈ సందర్భంగా తహసిల్దార్ చంద్రశేఖర్ నాయక్ మాట్లాడుతూ గతంలో జరిగిన రీ సర్వేలో ఉన్న పొరపాటులను సరి చేసేందుకు గ్రామసభల ద్వారా అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. రీ సర్వే జరిగిన గ్రామాల్లో ఈనెల 23 తేదీ నుంచి రెవెన్యూ గ్రామసభలు నిర్వహిస్తామన్నారు.