ప్రతి రైతు భరోసా కేంద్రాలలో ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించాలని, వ్యకాస జిల్లా సహాయ కార్యదర్శి పక్కిరి సాహెబ్, డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు బాబు డిమాండ్ చేశారు. మంగళవారం నందికొట్కూరు మండలంలోని మల్యాల గ్రామంలో పొలం పిలుస్తోంది అనే కార్యక్రమానికి హాజరైన అధికారులకు రైతులతో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు నాగరాజు, శంకరయ్య, నరసింహులు, , మాషన్న, శ్రీనివాసులు, పాల్గొన్నారు.