అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయంగా రూ. 20 వేలు ఇవ్వాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి పంపన్న గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం నందవరంలోని మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీని విస్మరిస్తుందని ఆరోపించారు. తక్షణమే రైతులకు పెట్టుబడి సాయం అందజేయాలని తహశీల్దార్ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు.