కర్నూల్ జిల్లా సి.బెలగల్ మండలంలోని యనగండ్ల గ్రామంలో ఏపీ ప్రభుత్వం అవ్వ తాతలకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు రూ.2250 నుండి రూ.2500 పెంచిన పెన్షన్లు గ్రామ సర్పంచ్ ఇమ్మనియేలూ, ఎంపీటీసీ తిమ్ములమ్మా చేతుల మీదుగా పంపిణీ చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం మా పెన్షన్లు పెంచినందుకు పెన్షన్ దారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసిస్టంట్ చందు, పంచాయతీ కార్యదర్శి మేరీ థెరిస్సా, డిజిటల్ అసిస్టంట్ సత్యరాజ్, వాలంటరీలు పాల్గొన్నారు. వెల్ఫేర్ అసిస్టంట్ చందు మాట్లాడుతూ.. గతంలో యనగండ్ల గ్రామ సచివాయల పరిధిలో మొత్తం పెన్షన్ దారులు 364 మంది ఉండగా వీరికి రూ. 8,47,750 వచ్చేవి , ఇప్పుడు పెరిగిన సందర్భంగా 378 ఉండగా రూ. 9,45,500 వస్తున్నాయని అన్నారు.