కర్నూల్ జిల్లా కోడుమూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న గూడూరు మండలంలోని కే. నాగలాపురం, పెంచికలపాడు గ్రామాలలో కొత్తగా మంజూరైన వైఎస్సార్ పెన్షన్ కానుకను అందించడానికి ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ వచ్చి పెన్షన్ దారులకు వైఎస్సార్ పెన్షన్ కానుకను అంచించారు.
అనంతరం పెంచికలపాడు గ్రామ ప్రజలు ఎమ్మెల్యే ని మా గ్రామంలో త్రాగునీరు, సీసీ రోడ్లు , డ్రైనేజీ వ్యవస్థలు చాలా అధ్వానంగా ఉన్నాయి, మా గ్రామ సమస్య తీర్చండి అంటూ అడిగారు. కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ చాలా సానుకూలంగా స్పందించి పై అధికారులతో మాట్లాడి కె. నాగలాపురం, పెంచికల పాడు రెండు గ్రామాల దాహాన్ని, రోడ్లు, డ్రైన్ల సమస్య తీరుస్తా అని అన్నారు.
అడిగిన వెంటనే సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యేకు రెండు గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యకరమానికి, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.