కర్నూలు జిల్లా సి. బెళగల్ మండలంలో స్థానిక ఎంపీడీవో ఆఫీస్ ముందర గ్రీన్ అంబాసిడర్లకు తోపుడుబండ్లను పంపిణీ చేసే కార్యక్రమానికి కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలను శుభ్రంగా ఉంచుకోవాలని జగనన్న ప్రభుత్వం చేపట్టిన "స్వచ్ఛ సంకల్పం" తోపుడుబండ్ల ను ఉపయోగించి గ్రామాలను శుభ్రంగా ఉంచుకోవాలని గ్రీన్ అంబాసిడర్లకు ఎమ్మెల్యే తెలియజేశారు. దీని ద్వారా పిల్లలకు మలేరియా డెంగ్యూ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయని అన్నారు
ఈ కార్యక్రమానికి మండల ఎంపిపి మునెప్ప, మండల జెడ్పిటిసి గిరిజోన్, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు