కర్నూలు జిల్లా సి. బెళగల్ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్య అధికారిణిగా డాక్టర్ సునీత బాధ్యతలు గురువారం స్వీకరించారు. ఈమె గతంలో నంద్యాల జిల్లా అవుకు మండలం ఉప్పలపాడు గ్రామంలో వైద్యాధికారి గా మూడునెలలు బాధ్యతలు నిర్హహించారు. సి. బెళగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారిగా విధులు నిర్వహించిన డాక్టర్ దీపక్ రవీంద్ర ఎమ్మిగనూరు పట్టణంలోని జనరల్ హాస్పిటల్ కి బదిలీ కావడంతో కాళీగా ఉన్న స్థానానికి డాక్టర్ సునీతబాధ్యతలు స్వీకరించారు.