జగనన్న విద్యాదీవెన మూడవవిడతపై అవగాహన సమావేశం

3245பார்த்தது
జగనన్న విద్యాదీవెన మూడవవిడతపై అవగాహన సమావేశం
కర్నూల్ జిల్లా సి బెలగల్ మండలంలోని యనగండ్ల గ్రామ సచివాలయంలో ఈ నెల 30వ తేదీన "జగనన్న విద్యాదీవెన" మూడవ విడత జమ కానున్న నేపథ్యంలో విద్యార్థులకు, తల్లులకు అవగావహన సదస్సు ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం పంచాయతీ కార్యదర్శి మేరీ థెరిస్సా సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ఎంతో ఇష్టమైన విద్యా దీవెనపథకం ఈ నెల 30 తారీఖున తల్లుల ఖాతాలో జమ చేస్తారు. లబ్దిదారుల ఈ పతాకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎంతో మంది తమ పిల్లలను తదివించుకొలేని తల్లిదండ్రులకు ఈ పథకం వరం లాంటిది అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇమ్మనుయేలు, సంక్షేమ అసిస్టంట్ చందు, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, వీఆర్వో వెంకటేష్, విద్యార్థులు, విద్యార్థుల తల్లదండ్రులు మొదలగు వారు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி