నంద్యాల జిల్లా బేతంచెర్లలో శుక్రవారం సాయంత్రం వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున గుమిగూడి టీడీపీ ఆఫీసుపై దాడికి ప్రయత్నం చేశారు. బేతంచెర్ల టీడీపీ ఇంచార్జి ధర్మారం సుబ్బారెడ్డి, ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డిని విమర్శించినందుకు వైఎస్సార్సీపీ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టారు. ఈ మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు.