మంత్రికి రీ సర్వేలో నెలకొన్న భూ సమస్యలను గ్రామసభల ద్వారా అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తెలిపారు. శుక్రవారం ఆదోని మండలం మంత్రికి గ్రామంలో రీ సర్వేపై గ్రామసభను నిర్వహించి, రైతుల నుంచి అర్జీలు స్వీకరించి, మాట్లాడారు. సమస్యలను విచారించి త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. రీ సర్వేలో తలెత్తిన భూ సమస్యలను గ్రామసభల ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు.