ఈ నెల 9, 10వ తేదీలలో గూడూరులో జరగబోయే యూటీఎఫ్ జిల్లా స్వర్ణోత్సవ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి లింగప్ప తెలిపారు. ఆదోని యూటీఎఫ్ కార్యాలయంలో పోస్టర్ ను విడుదల చేశారు. పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని గ్రహించి ఉపాధ్యాయులు సన్నద్ధం కావాలన్నారు. రుద్రముని, రామాంజనేయులు ఉన్నారు.