కర్నూలు: ఘోరం.. కన్నతల్లి పై కొడుకు దాడి
కన్నతల్లి పైనే కుమారుడు దాడి చేసిన ఘటన శనివారం రాత్రి ఆదోని పట్టణంలోని విక్టోరియా పేటలో చోటు చేసుకుంది. బాధితురాలు పార్వతిని, కుమార్తెలు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. పార్వతికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు నాగరాజు తాగుడుకు బానిసై బెంగళూరుకు వలస వెళ్లి, తిరిగి వచ్చి ఇల్లు తన పేరుపై రాయించాలని గొడవ పెట్టుకున్నాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో దాడి చేశాడు.