అనంతపురంకు చెందిన జింకలా రామాంజినేయులు అనే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై ఆదోని త్రీటౌన్ పోలీసు స్టేషన్ లో గురువారం టీడీపీ నియోజకవర్గం అధ్యక్షుడు సజ్జాద్ హుస్సేన్, పట్టణ అధ్యక్షురాలు అంజినమ్మ ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బాలకృష్ణపై అనుచిత వాక్యాలు చేస్తూ, అసభ్యకరమైన ఫోటోలు ట్రోల్ చేస్తున్నాడని, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు.