ఆదోని పట్టణంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలకు సొంత భవనాలు నిర్మించాలని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి కోరారు. శుక్రవారం మంగళగిరిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలసి వినతిపత్రం అందజేసి, ఆయన మాట్లాడారు. కళాశాలలకు సొంత భవనాలు లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రస్తుతం డిగ్రీ కళాశాలను అద్దె భవనంలో నడుపుతున్నారని భవనాలకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.