విజయవాడ ఐసీఐసీఐ బ్యాంకు స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. శనివారం బ్యాంకు మేనేజర్ నరేశ్ బృందం పెట్టుబడి పెట్టిన సంస్థకు సీఐడీ నోటీసులు ఇచ్చింది. నెక్సస్ సంస్థతో నరేశ్ లావాదేవీలు జరిపినట్లు సీఐడీ గుర్తించింది. ఖాతాదారుల నుంచి కాజేసిన డబ్బంతా నరేశ్ బృందం నెక్సస్ గ్రోత్లో పెట్టుబడి పెట్టినట్టు సమాచారం. దీంతో నరేశ్ తో లావాదేవీలు నిర్వహించిన వారిని సీఐడీ అధికారులు విచారించే అవకాశముంది.