విజయవాడ: ఆలయాల్లో నెయ్యి వాడకంపై నియంత్రణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంగళవారం ప్రకటించింది. ప్రముఖ ఆలయాల్లో కచ్చితమైన నిబంధనలు, నియమాలు అమలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఆలయంలో వేద సభలు నిర్వహించాలని దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు.