ఉచిత సిలిండర్ల పథకం రాయితీ నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. సోమవారం తాడిగడ్డలోని ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ గ్యాస్ కంపెనీలు, పౌరసరఫరాల శాఖ తెరచిన ఖాతాలో ఈ నిధులు జమచేయనున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని మంత్రి పార్థసారథి తెలిపారు.