ప్రతి ఒక్కరికి గృహ నిర్మాణాలు మంజూరుకి కృషి చేస్తా: మంత్రి
అర్హులైన ప్రతి ఒక్కరికి గృహ నిర్మాణాలు మంజూరు చేయడానికి కృషి చేస్తానని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. సోమవారం మొవ్వ మండలం కారకంపాడు గ్రామంలోని ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఉందని పేర్కొన్నారు.