ఏలూరు జిల్లాలో విషాదం
ఏలూరు జిల్లా నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. చెరువులోకి వెళ్లిన గేదెలను బయటకు తీసుకొచ్చేందుకు వెళ్లిన భర్త కొండ రాంబాబు మునిగిపోవడంతో భార్య ప్రశాంతి అతన్ని కాపాడేందుకు నీళ్లలో దిగింది. దీంతో ఇద్దరూ నీటిలో మునిగిపోవడంతో మృతి చెందారు. స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.