పేద ప్రజల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు తెలిపారు. సోమవారం, మైలవరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా, సీఎం నారా చంద్రబాబునాయుడు పేదలకు అండగా నిలుస్తున్నారని కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.