మచిలీపట్నం: రహదారి భద్రతపై దృష్టి సారించాలి
రహదారి భద్రత చర్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ తెలిపారు. మంగళవారం మచిలీపట్నంలోని కలెక్టరేట్ లోని ఛాంబర్ నందు జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రహదారి ప్రమాదాలు జరగకుండా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, ట్రాఫిక్ అధికారులు పాల్గొన్నారు.