ఈనెల 15వ తేదీన జరిగే కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా పోలీసు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ గంగాధర్ రావు అన్నారు అన్నారు. శనివారం మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ వచ్చే వాహనాలను ట్రాఫిక్ మళ్లించటం, ట్రాఫిక్ నియంత్రణ చేసి ప్రత్యేక పార్కింగ్ స్థలమున ఏర్పాటు చేస్తామని ఎస్పీ తెలిపారు.