నాల్గవ తరగతి ఉద్యోగులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని రెవెన్యూ ఉద్యోగ రాష్ట్ర బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాల్గవ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం ఎగ్జిక్యూటివ్ సమావేశం మచిలీపట్నంలో ఆదివారం జరిగింది. నాల్గవ తరగతి ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘ చర్చించారు. ముఖ్యంగా పిఆర్సి అమలు, ఉద్యోగులకు న్యాయపరంగా అందవలసిన బాకాయలు తదితర అంశాలు మాట్లాడారు.