మచిలీపట్నంకు చెందిన జనసేన నాయకులు వెంకట్రావ్ కు విజయవాడ దుర్గగుడి దసరా ఉత్సవ కమిటీలో స్థానం దక్కింది. 53 మందితో ఏర్పాటైన కమిటీలో వెంకట్రావ్ ప్రథముడిగా ఉన్నారు. వెంకట్రావ్ తోపాటు టీడీపీ సీనియర్ నాయకులు, మున్సిపల్ మాజీ ఛైర్మన్ బాబా ప్రసాద్ కూడా ఉత్సవ కమిటీ సభ్యునిగా గురువారం నియమితులయ్యారు. వీరి ఇరువురి నియామకం పట్ల కూటమి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.