ముదినేపల్లి మండలం బొమ్మినంపాడు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా కామినేని మాట్లాడారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని రైతులకు రాష్ట్రంలో మరియు కేంద్రంలో కూటమి ప్రభుత్వ పెద్ద పీట వేసిందన్నారు. రైతులు ప్రభుత్వం అందించే పథకాలని సద్వినియోగం చేసుకుంటూ మంచి లాభసాటి పంటలను పండించాలని కోరారు.