కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడి కుటుంబ సభ్యులను సోమవారం రాత్రి జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య పరామర్శించారు. పెనుగంచిప్రోలు మోడల్ కాలనీలో బాలతొట్టి గోపాలరావు, నాగరాణి ల రెండేళ్ల కుమారుడు ఆరుబయట ఆడుకుంటున్న సమయంలో వీధి కుక్కలు దాడి చేసి చంపేసిన విషయం తెలుసుకుని మృతి చెందిన రెండేళ్ల బాబు భౌతికదేహాన్ని సందర్శించి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.