అనుమతులు లేకుండా బాణాసంచా దుకాణాలను ఏర్పాటు చేస్తే ప్రేలుడు పదార్థాల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పెనుగంచిప్రోలు ఎస్ఐ అర్జున్ హెచ్చరించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా బాణాసంచా దుకాణాలను ఏర్పాటు చేసినా సరైన భద్రతా ప్రమాణాలు లేకుండా దుకాణాలు ఏర్పాటు చేసి విక్రయాలు జరిపిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.