దీపావళికి భద్రతా ప్రమాణాలు పాటించాలని జగ్గయ్యపేట సీఐ పి. వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఆదివారం జగ్గయ్యపేట పట్టణ పరిధిలో ఏర్పాటు చేసేటటువంటి బాలా సజ్జ దుకాణాల ఏర్పాటు స్థలాన్ని సిఐ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమతులు లేకుండా బాణాసంచ దుకాణాలను ఏర్పాటు చేస్తే ప్రేలుడు పదార్థాల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.