పెనుగంచిప్రోలు గ్రామ రక్షిత మంచినీటి సరఫరా పథకానికి శాశ్వత పైపులైన్ నిర్మాణ పనుల కోసం కృషి చేస్తానని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ పేర్కొన్నారు. ఇటీవల మునేటికి వచ్చిన వరదల వల్ల పెనుగంచిప్రోలు రక్షిత మంచినీటి సరఫరా పథకం మునేటిలో వరద ధాటికి కొట్టుకుపోయిందన్నారు. దీని మరమమ్మత్తు పనులను మంగళవారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సమస్య విషయమై సీఎం చంద్రబాబుతో మాట్లాడతానని తెలిపారు.