దీపావళి ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకునేలా బాణాసంచా దుకాణాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అగ్ని ప్రమాదాలకు తావు లేకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం గుడివాడలో దొండపాడు కాలువ సెంటర్ వద్ద దీపావళి సందర్భంగా ఏర్పాటు చేయనున్న బాణాసంచా దుకాణాల ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.