బాపులపాడు మండలం బండారుగూడెం గ్రామంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్ట్ సర్వేలో వచ్చిన భూ సమస్యలు పరిష్కారానికి గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో సిపిఎం పార్టీ నాయకులు బర్రె లెనిన్ మాట్లాడుతూ రైతులకు రీ సర్వేలో ఎటువంటి అవకతవకలు లేకుండా చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్వేయర్ మౌనిక, విఆర్ఓ రామాంజనేయులు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.