భారీ వర్షాలకు నాగాయలంక మండలంలోని భావదేవరపల్లి, కమ్మనమోలు, నాలి, బర్రంకుల, పర్రచివర, గుల్లలమోద, గణపేశ్వరం, తలగడదీవి, దీనదయాల్ పురం, సొర్ల గొందిలో రైతులు సాగు చేసిన వెయ్యికి పైగా ఎకరాలలో వరి పంటకు తీవ్ర నష్టం జరిగినట్టు అన్నదాతలు ఆదివారం తెలిపారు. తీర ప్రాంతాలలోని అవుట్ ఫాల్ స్లూయీస్ లు సక్రమంగా పనిచేయక పోవటంతో వరి పొలాలలోని వరద నీరు వచ్చిందన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని అన్నారు.