రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రాష్ట్రంలోని అన్ని సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి సహకార వ్యవస్థకు పునరుత్తేజం కలిగించనున్నట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గురువారం మోపిదేవిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు విస్తృత సేవలు అందిస్తున్న సహకార వ్యవస్థను గత ఐదేళ్లలో నిర్వీర్యం చేశారని, అయితే అధికారులు కొంతమేరకు ఈ వ్యవస్థను రక్షించుకున్నారని తెలిపారు.