గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ నిర్మాణం వేగవంతం చేయాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం రాత్రి మచిలీపట్నంలో మంత్రి నివాసంలో గిలకలదింది ఫిషింగ్ హార్బర్, మత్స్యశాఖ అధికారులతో హార్బర్ పురోగతిపై సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఫిషింగ్ హార్బర్ నిర్మాణం రెండు సంవత్సరాలు అయినా ఎందుకు పూర్తి కాలేదని సంబంధిత అధికారులను ప్రశ్నించారు.