ఘంటసాల మండల పరిధిలోని పాపవినాశనం కృష్ణానదిలోకి వెళ్లి పడవల్లో ఇసుకను తీసుకొని బయట ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేవని అధికారులు చెబుతున్నప్పటికీ ట్రాక్టర్ డ్రైవర్లు ఐదు పడవలు ఏర్పాటు చేసుకుని కృష్ణా నది నుంచి తీసుకువచ్చి ట్రాక్టర్లలో లోడింగ్ చేస్తున్నారు. శనివారం ఇదేమిటని ప్రశ్నించిన గ్రామస్తులపై ట్రాక్టర్ డ్రైవర్లు గొడవకు దిగారు.