కృష్ణా నది నుంచి భారీగా ఇసుకను బయటకు తరలిస్తున్న సంఘటన మోపిదేవి మండలంలో కొనసాగుతుంది. మోపిదేవి మండలం కే. కొత్తపాలెం కృష్ణానది నుంచి పడవలు ఏర్పాటు చేసుకుని నది మధ్యలో గురువారం సాయంత్రం ఇసుకను తీసి ఎడ్లబండ్ల ద్వారా బయటికి తరలిస్తున్నారు. నదిలో ఇసుక తీయడానికి వీలులేదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కొందరు వ్యక్తులు స్వలాభేపేక్షతో కృష్ణానది నుంచి తీసుకొని బయటకు తీసుకువస్తున్నారు.