రేషన్ బియ్యంతో అక్రమ వ్యాపారం చేస్తే చర్యలు తప్పవని అవనిగడ్డ ఎస్ఐ కే. శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పోలీసుల కథనం ప్రకారం బుధవారం ఉదయం అవనిగడ్డ రెండో వార్డు లంస బేకరీ సమీపంలో ట్రక్ ఆటోలో తరలిస్తున్న రెండు టన్నుల రేషన్ బియ్యం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న రాజాను పోలీసులను గమనించి పరారు కాగా, డ్రైవరును అదుపులోకి తీసుకున్నారు.