ప్రజలందరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని తిరువూరు ఎస్సై సత్యనారాయణ కోరారు. శనివారం తిరువూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకర్ల గ్రామంలో సైబర్ నేరాలపై స్థానికులకు పోలీసులు అవగాహన కల్పించారు. ముఖ్యంగా మహిళలు సైబర్ నేరాలు విషయంలో అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. తిరువూరు పోలీసులు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.