రాజమండ్రి: వర్తకుల శ్రేయస్సే లక్ష్యం: ఎమ్మెల్యే
రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కమిటీ అభినందన సభ గురువారం సాయంత్రం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొని మాట్లాడారు. వర్తకుల శ్రేయస్సే లక్ష్యంగా నూతన కమిటీ పని చేయాలని సూచించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు వారు అభినందనలు తెలియజేశారు.