రాజమండ్రి: కిక్కిరిసిన గోదావరి తీరం
కార్తీక మాసం సందర్భంగా రాజమండ్రి పుష్కర ఘాట్ గోదావరిలో భక్తులు శనివారం తెల్లవారుజాము నుంచి పవిత్ర గోదావరిలో స్నానాలు చేసి పూజలు నిర్వహించారు. కార్తీక మాసంలో ఎంతో పవిత్రంగా పూజలు చేసి నెల రోజులు పాటు ప్రతిరోజు కార్తీక దీపాలను వెలిగిస్తూ నిష్ఠగా పూజలు ఆచరిస్తారు. రాజమండ్రి గోదావరి ఒడ్డకు తెల్లవారుజాము నుంచి భక్తుల తాకిడి మొదలైంది.