నాయి బ్రాహ్మణ కుల దైవం, తొలి వైద్యులు భగవాన్ శ్రీ ధన్వంతరి జయంతి వేడుకలను పురస్కరించుకుని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరిని వారి నివాసంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం నవంబర్ 12వ తేదీ నాడు విజయవాడ లోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు జరిగే ధన్వంతరి జయంతి వేడుకలకు ఆహ్వానించారు.