చంద్రబాబు వదిలిన విషపు బాణమే షర్మిల అని పామర్రు మాజీ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ ఆరోపించారు. సోమవారం పామర్రు వైసీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. షర్మిల లాంటి చెల్లెలు జగన్‌కు ఉండడం బాధాకరమని తెలిపారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ప్రజల గుండెల నుంచి తుడిచేయాలని చూసే టీడీపీతో ఆమె కుమ్మక్కు కావడం దారుణమన్నారు.