మైలవరం నియోజకవర్గ పరిధిలోని నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (ఎన్. ఎస్. పి) కాల్వలపై ఇటీవల అకాల వరదల ధాటికి పడిన గండ్లు పూడ్చివేతకు యుద్ధప్రాతిపదిక చర్యలు తీసుకోవాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం మైలవరంలోని శాసనసభ్యులు వారి కార్యాలయంలో ఎన్. ఎస్. పి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.