ఎన్టీఆర్ జిల్లా తోలుకోడు నుండి మైలవరం వెళ్లే రోడ్డు మార్గం పిచ్చి మొక్కలతో అద్వానంగా తయారైంది. ఈ విషయాన్ని గ్రామ టీడీపీ నాయకులు దావూలూరి సురేంద్ర కుమార్ దృష్టికి పలువురు గ్రామస్తులు తీసుకెళ్లారు. స్పందించిన ఆయన ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు నాయకత్వంలో శుక్రవారం తన సొంత నిధులతో 7 కిలోమీటర్ల మేర రోడ్ రెండు వైపుల క్లియరెన్స్ పనులను చేపట్టారు. గ్రామస్తులు, వాహనదారులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.