కృష్ణా జిల్లాకు సంబంధించి ఈ నెల 14న మచిలీపట్నంలోని హిందూ కాలేజీలో మద్యం టెండర్లు నిర్వహించనున్నట్టు ఉమ్మడి కృష్ణా జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు బుధవారం మచిలీపట్నంలో తెలిపారు. తొలుత టెండర్లు తెరిచే కార్యక్రమాన్ని నోబుల్ కాలేజీలో నిర్వహించాలని నిర్ణయించగా అనివార్య కారణాల వల్ల హిందూ కాలేజీ పీజీ సెంటర్, ఎంబిఏ బ్లాక్ కు మార్చడమైందన్నారు. ఈ మార్పును టెండరుదారులు గమనించాలన్నారు.