ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ (NMMS)కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారిణి తాహేరా సుల్తానా బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 8వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. దరఖాస్తులను ఈ నెల 17వ తేదీ లోపు అందజేయాలన్నారు. ఇతర వివరాలకు మచిలీపట్నంలోని డీఈవో కార్యాలయం ద్వారా తెలుసుకోవాలని సూచించారు.