జగ్గయ్యపేట పాలేటి ఒడ్డున పునర్నిర్మిస్తున్న మఠం శివాలయానికి వినియోగించే కృష్ణ శిలలు ఈ నెల 11వ తేదీ సోమవారం జగ్గయ్యపేటకు రానున్నాయని దేవస్థానం ట్రస్ట్, ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా అర్చకులు ఘట్టి సాయి మాట్లాడుతూ నేపాల్ లోని పశుపతి నాథ్ దేవాలయం తరహాలో 16 స్తంభాలతో సర్వతోభద్ర మండల విధానంలో ప్రపంచంలోనే రెండవదిగా ఈ దేవస్థానం నిర్మాణం జరపాలని
నిర్ణయించారని తెలిపారు.