రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావిస్తూ సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ముందుకు సాగుతుందని గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం నందివాడ మండలంలో నిర్వహించిన పల్లె పండగ కార్యక్రమంలో కూటమి నేతలతో కలిసి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.